Posts

సంక్రాతి శుభాకాంక్షలు... 🔯✡

Image
ముంగిట  ముత్యాల  ముగ్గులు.. మంచు  తెరలను  చీల్చుకుంటూ.. ఉత్తరాయణ పుణ్యకాలం  లో. అరుణ కిరణుడి  మకర  సంక్రమణము, బంతి  చామంతుల నేత్ర పర్వం, మెడలో  గంటలు  గణ  గణ  మోగ, ఎద్దు  బండ్ల లో.. ధాన్యలక్ష్మి కొలువయి ఇళ్లకు  చేరే  మహా సంబరం, గోవు  మా లక్ష్మికి కోటి  దణ్ణాలు..  పరమాన్నాలు  పొంగళ్ల  తో... కొత్త  అల్లుళ్ళు కు  విందు  భోజనాలు... మూడు  రోజుల  ముచ్చట యిన  సంక్రాతి   బాపు  కుంచె  తో  కదలి వచ్చి,మీ  ముంగిట  నిలవాలి,   సుఖ  శాంతుల తో, సిరి  సంపద  లతో  మీ  లోగిళ్ళు... కళ కళ  లాడాలి.

When my first child was three months old.. chinnari papayee

Image
చిన్నారి  పాపాయి  నవ్వింది . చిరు  దివ్వె  వెలిగిందీ  మా  ఇంట.  కలువల  కన్నులు, కాంతుల్ని  వెదజల్లగా, పాల  నవ్వులు పూల జల్లుల్ని కురిపింపగా, పాపాయి  మాటే ఒక  పాట.. పాపాయి  ఆటే  ఒక  పండుగ.. !చిన్నారి !... కంసారి  తో నీకు  అన్నింట పోటీ.. చిన్న కృష్ణమ్మే.. సరి  అయిన  జోడి. కొండల రే డే  అండగా  నిలువ.. పాపాయి  నవ్వాలి  మళ్ళీ  మళ్ళీ. నవ్వుల్లో  తీరాలి  వెతలన్నీ.   " చిన్నారి "

పోతనామాత్యుని క్షీరసాగర మధనము

 స్థితి  కారకుడు  శ్రీ  మన్నారాయణుడు. కర్మ లను  ఆచరించువాడు,  జీవుల  చేత  ఆచరింపచేయు  వాడు... కర్మ  ఫలా న్ని ప్రసాదించువాడు,  దుష్కర్మ ల  ఫలితాన్ని  అనుభవింపచేయువాడు... వాటినుండి  అమిత  దయాళువై  రక్షించు  స్వామి.... హరి  మరి  విశ్వ  విభుడు  గాదె!  CEO of this Universe.   జగముల  దుఃఖం  ము  నెరిగి,  జల  జనిత  విషంబును,  తన  అర్ధభాగమున  కెరిగించి, అమృత  పానం  కాదు, హాలాహలం  అని  యెరిగి స్వీకరించు  వాడు  హరుడు  గాక  మరి  ఎవ్వరు?పెక్కులు  పలుకంగా  నేల.. హరి యొక్క  వేరొక  రూపమే   ఆ నీల  లోహితుడు హరుడుగాదె!    మింగెడిది  గరళం  అని,  మింగేడు  వాడు  వల్లభుడని, మే లగును  ప్రజకు, ఒక వంక   విభుని  రక్ష, వేరొక వంక  బిడ్డల  రక్ష... చేయ  శ క్య మా?  అందరి  మాంగళ్య  మును  రక...

గోపాల బాలుడు

Image
నీల మేఘ మోహనునికి ..          దేవకీ తనూభవునకు...     యశోద తనయునికి,  వసుదేవ  సుతునికి, నందాత్మజునికి, రాధా  మనోహరునికి, రుక్మిణి ప్రియ వల్లభునికి,  కంసారికి,సుధామ సఖునికి, ప్రహ్లాద  వరదునికి,  ద్రౌపదీ మాన రక్షకుని కి,  గీతా చార్యు ని కి,a జగద్గువురువునకు,  దుష్ట జనదమనునికి, ఆశ్రీత వత్సలు  నికి, సజ్జన హ్రిదయ  వనమాలికి, భాగవత కధా  నాయకుని కి,  మునిజన  సేవితునికి, అరిషడ్వర్గ  వినాశకు నికి, కర్మ భక్తి  జ్ఞాన వైరాగ్య  ప్రదాతకు, ముక్తి దాతకు, సత్వగుణ  సంపన్నుఁని కి, సంసార భయ  హరునికి, జన్మ మృత్యు జరా రోగ వినాశకునికి, నాదప్రియునకు, వేదమయునకు, సర్వా ర్తి  శ మనునికి,  అఖిలండా కోటి భ్రహ్  మ్మండా నాయకునికి, అనంతునికి, ఆత్మ  స్వరూపునికి, పరమాత్మ గా, మన అందరి  హ్రిదయాల  లో  వెలుగొందు  పరాత్పరునికి... హరికి... నారాయణుకి... శ్రీకృష్ణ స్వామికి....   సర్వదా శరణాగతి  సల్పెద... రక్షించమని  వేడెద... అభయమిచ్చి ...

A letter to my Dad... (December 16, 2010)

Image
A real hero and fighter in all walks of life: Pleasure and Pain.. Ups and Downs.. Success and Failure... Dark and Light... Celebrations and Calamities... Service and Sacrifice.. Blend of all forms of life countered with great grace and Composure and exemplary strength... Undaunted faith in Daivam... An untiring personality till the end..as his model Hero Napoleon Bonaparte. Jayaho! Bangaru Babayyagaru!! 🙏🙏 Dear Babayyagaru,      Today is your birthday. As I see the sunrise early in the morning, I remember the warmth of your love, your radiant personality that knows not to look back ever.      When I look at the plants which are growing in the balcony, who else will come to my thoughts if not you. You were like a wandering monk in your garden in the early hours of morning.      The beautiful library and the rose wood almirah room displays such great number of books starting from Ramayanam and Bhagavatam, Veeresa Lingam, Chilakamarti to...

వామన మూ ర్తి

బ్రహ్మ కడిగిన  పాదము,  బ్రహ్మము తానయిన పాదము,  బలి తల మోపిన పాదము,  అని అన్నమయ్య కొలిచిన పాదము,   కామితార్ద ఫలము నిచ్చి కైవల్యము నొసగ, రామదాసు వేడిన పాదము  శ్రీరామ పాదమా, నీ కృప చాలునే అని త్యాగయ్య మురిసిన పాదము,  బలి తల నుంచి అధో లోకము ల నేలిక కమ్మని శాశించిన త్రివిక్రమ పాదము, పరమ కారుణ్యముతో తల వాకిలి కాపలా కాచి, దనుజేశ్వరునికి  పరమపదాన్ని  ప్రసాదించిన శ్రీహరి  పాదము..  పోతనా మాత్యుని అమూల్య గంటములో నిలిచి... జనన మరణ భయాన్ని  హరించి, మనని సంసార జలధి దాటించ, సిరి చేతులలో సదా  పల్లవించు  శ్రీ  పాదమునకు,  ఆ శ్రీహరి పాదమునకు... మరల మరల వందనము..  🙏🙏🙏