వామన మూ ర్తి

బ్రహ్మ కడిగిన  పాదము, 
బ్రహ్మము తానయిన పాదము, 
బలి తల మోపిన పాదము, 
అని అన్నమయ్య కొలిచిన పాదము,  
కామితార్ద ఫలము నిచ్చి కైవల్యము నొసగ, రామదాసు వేడిన పాదము 
శ్రీరామ పాదమా, నీ కృప చాలునే అని త్యాగయ్య మురిసిన పాదము, 
బలి తల నుంచి అధో లోకము ల నేలిక కమ్మని శాశించిన త్రివిక్రమ పాదము,
పరమ కారుణ్యముతో తల వాకిలి కాపలా కాచి, దనుజేశ్వరునికి  పరమపదాన్ని  ప్రసాదించిన శ్రీహరి  పాదము.. 
పోతనా మాత్యుని అమూల్య గంటములో నిలిచి... జనన మరణ భయాన్ని  హరించి, మనని సంసార జలధి దాటించ, సిరి చేతులలో సదా  పల్లవించు  శ్రీ  పాదమునకు, 
ఆ శ్రీహరి పాదమునకు... మరల మరల వందనము.. 
🙏🙏🙏


Comments